

‘ఖైదీ, విక్రమ్, కూలీ, లియో’ వంటి విజయవంతమైన చిత్రాలతో కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘డిసి’ సినిమా జూలై 31న విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న లోకేశ్ తన తదుపరి ప్రాజెక్టుపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈసారి దర్శకుడిగా లేదా హీరోగా కాకుండా నిర్మాతగా కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్నారని, హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథ సిద్ధమైందని, మహిళా ప్రధాన కథ కావడంతో రెజీనా వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!