
షోస్

ముంబై–గోవా జాతీయ రహదారి ఎన్‌హెచ్-66పై వంతెనకు ఎం-సీల్‌తో మరమ్మతులు చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగోఠణే సమీపంలోని వంతెన గోడలకు ఏర్పడిన పగుళ్లను కార్మికులు ఎం-సీల్‌తో పూడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో జాతీయ రహదారి నిర్వహణ, నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ వాహనాలు రాకపోకలు సాగించే వంతెనకు సాధారణ పూడ్చివేతకు బదులుగా సాంకేతికంగా తగిన మరమ్మతు విధానాలను అవలంబించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాంక్రీట్ రిపేర్, నిర్మాణ బలోపేతం, ఇంజెక్షన్ గ్రౌటింగ్ వంటి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వంతెన భద్రతపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!