

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ భవనం కుప్పకూలింది. ఈ భవనాన్ని పేయింగ్ గెస్ట్ (PG) వసతిగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. భవనం కూలిన సమయంలో లోపల పలువురు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద సుమారు 50 మంది విద్యార్థులు చిక్కుకుని ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే శిథిలాల కింద ఉన్న వారి ఖచ్చిత సంఖ్యపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కనీసం ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. శిథిలాలను జాగ్రత్తగా తొలగిస్తూ మరికొందరి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనకు గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!