

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెంలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన, హీరో మోటార్స్ ఈవీ తయారీపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. సంస్థ ప్రకటించిన రూ.3,200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని కోరారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటికే 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. హీరో మోటార్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 40 శాతం మంది మహిళలేనని, పరిశ్రమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనుకూల వాతావరణాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!