
సినిమాలు

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో 19 ఏనుగులు సంచరిస్తుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. తమిళనాడు వైపు నుంచి వచ్చిన 16 ఏనుగుల గుంపు ప్రస్తుతం పెద్దూరు అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా, గొల్లపల్లి సమీపంలో మరో జంట ఏనుగులు, పెద్దూరు పరిసరాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రాత్రికి ఏనుగుల గుంపు పెద్దూరు, ఆరిమాని పెంట, జీడిమకులపల్లి, ననియాల, రామాపురం తండా వైపు వచ్చే అవకాశం ఉందని అటవీ అధికారులు హెచ్చరించారు. రాత్రి సమయంలో రైతులు, గ్రామస్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాల వైపు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!