
రాజకీయాలు

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పాఠశాలల్లో ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఇకపై ఆన్‌లైన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకుని, ఒకసారి ఉపయోగించే సంకేత సంఖ్య (ఓటీపీ) ద్వారా ధ్రువీకరణ పూర్తిచేసిన అనంతరం ఫిర్యాదును నమోదు చేసే విధానాన్ని రూపొందించారు.
ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత దాని పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా కల్పించారు. ఇందుకోసం ఫిర్యాదుల పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేట్ పాఠశాలలపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించడంతో పాటు, సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యం.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!