
రాజకీయాలు

బాపట్లలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం, బలమైన గాలుల ధాటికి పట్టణ శివారులోని 216ఏ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన భారీ సూచిక బోర్డు విరిగిపడింది. అయితే ఆ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సూచిక బోర్డు కూలిపోవడంతో బైపాస్‌పై కొంతసేపు ఒక వైపు మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతించారు. మరోవైపు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!