

పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్లు, విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫైని వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది. సురక్షితం కాని పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా క్యాప్టివ్ పోర్టల్ ద్వారా నకిలీ లాగిన్ పేజీలకు మళ్లించడం, తప్పుడు నోటిఫికేషన్లను చూపించడం వంటి పద్ధతులతో వ్యక్తిగత, ఖాతా వివరాలను దొంగిలించే ప్రయత్నాలు జరగవచ్చని తెలిపింది. హోటళ్లు, విమానాశ్రయాల్లో వినియోగదారుల గుర్తింపు కోసం క్యాప్టివ్ పోర్టల్‌లు సాధారణంగా ఉపయోగిస్తారు.
వైఫైకి కనెక్ట్ అయిన తర్వాత బ్రౌజర్ అప్‌డేట్, నెట్‌వర్క్ సమస్య పరిష్కారం, సెక్యూరిటీ చెక్ పేరుతో అనుమానాస్పద నోటిఫికేషన్లు కనిపిస్తే వాటిపై క్లిక్ చేయకూడదు. ఇలాంటి లింకులు హానికరమైన సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌కు లేదా నకిలీ లాగిన్ పేజీలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వీలైనంత వరకు వ్యక్తిగత మొబైల్ హాట్‌స్పాట్, ఎన్‌క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్‌లను ఉపయోగించడం మంచిదని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. పబ్లిక్ వైఫైలో సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయకుండా, అనుమానాస్పద సాఫ్ట్‌వేర్ లేదా అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేయకూడదని సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!