

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)లో 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్, 50 డ్రైవర్ పోస్టుల భర్తీకి శనివారం సరూర్నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఉద్యోగాల కోసం 3 వేల మందికి పైగా అభ్యర్థులు తరలిరావడంతో దరఖాస్తుల స్వీకరణ, ఫిజికల్ టెస్టులకు టోకెన్ల జారీ విషయంలో ప్రారంభంలో కొంత ఇబ్బంది ఏర్పడింది.
ఒకేసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ముందుకు రావడంతో వారిని నియంత్రించడంలో ఓ అధికారి అసహనానికి గురైనా, అనంతరం పరిస్థితిని సర్దుబాటు చేశారు. పోలీసుల సహకారంతో అధికారులు అభ్యర్థులను క్రమబద్ధీకరించి ఎంపిక ప్రక్రియను కొనసాగించారు. అందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రతి ఒక్కరికీ శారీరక పరీక్షకు అవకాశం కల్పిస్తామని లౌడ్స్పీకర్ల ద్వారా పదేపదే ప్రకటించడంతో యువత సహకరించింది. ఆగస్టు 8, 9 తేదీల్లో కూడా సరూర్నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!