
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గగనతలంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్ ఒక ప్యాసింజర్ విమానానికి అత్యంత సమీపానికి చేరింది. ఈ ఘటన ఆగస్టు 4న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ గగనతలంలో చోటుచేసుకుంది. రెండు విమానాల మధ్య దూరం ఒక మైలు కన్నా తక్కువగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే పరిస్థితిని గుర్తించి పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. కమ్యూనికేషన్ లోపమే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించాయి. వైట్ హౌస్ స్పందిస్తూ ట్రంప్ సురక్షితంగా ఉన్నారని, మెరైన్ వన్‌ను నిపుణులైన పైలట్లు నడుపుతారని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!