
జనరల్

మూసీ నది అభివృద్ధి పనుల్లో కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 83 ఎకరాల భూమిని ఇవ్వడానికి రక్షణశాఖ ఆమోదం తెలిపింది. వర్కింగ్ పర్మిషన్ కూడా జారీ చేసింది. ఈ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇది మూసీ పునరుజ్జీవంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు.
ఈవీఐ విధానంలో భూముల బదిలీ జరుగనుండగా, గాంధీ సరోవర్ ప్రాజెక్టులో 200 ఎకరాల్లో అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గాంధీ విగ్రహం, మ్యూజియం, ఎడ్యుకేషన్ హబ్, ధ్యాన మందిరం వంటి అనేక సదుపాయాలు ఇందులో ఉంటాయి. భూసర్వే, ఎంఓయూ ప్రక్రియ 15–20 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!