
జనరల్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన పాత్రికేయుడిగా ఆయనను కొనియాడారు. ప్రజల పక్షాన నిలిచే జర్నలిజంతో సమాజహితాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచే పాత్రికేయుడిగా రాధాకృష్ణను చంద్రబాబు ప్రశంసించారు. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’, ‘కొత్త పలుకు’ వంటి వేదికల ద్వారా సమకాలీన అంశాలపై ప్రజలను ఆలోచింపజేస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!