

దేశంలోని ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆరోగ్యకరమైన భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా బలహీన వర్గాలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని, దీనితో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
పీఎం భారతీయ జన ఔషధి పరియోజన వంటి పథకాల వల్ల ఔషధాలు, స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్లు తక్కువ ధరకే అందుతున్నాయని ఆయన అన్నారు. అలాగే మెడికల్ కాలేజీలు, సీట్లు పెరగడంతో వైద్య విద్య అందరికీ చేరువవుతోందని చెప్పారు. క్షయ వ్యాధి నిర్మూలన దిశగా దేశం వేగంగా ముందుకు సాగుతోందని, కొన్ని వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ఆరోగ్య రంగంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!