
సినిమాలు

పెద్దపులుల సంయోగ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక కార్యకలాపాలను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేశ్ అప్పావ్ తెలిపారు. జాతీయ పెద్దపులుల సాధికార సంస్థ (NTCA) మార్గదర్శకాల మేరకు అటవీ శాఖ నిర్వహిస్తున్న ఎకో టూరిజం, జంగిల్ సఫారీలు జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేయబడతాయని వెల్లడించారు.
ఆత్మకూరు, మార్కాపురం అటవీ డివిజన్ల పరిధిలోని బైర్లూటి, పచ్చర్ల, తుమ్మలబైలు, ఇష్టకామేశ్వరి తదితర పర్యాటక, పుణ్యక్షేత్ర ప్రాంతాల్లో ఈ కాలంలో సందర్శకులకు ప్రవేశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎకో టూరిజం కేంద్రాల్లోని కాటేజీలలో పర్యాటకుల బసపై ఈ ఆంక్షలు వర్తించవని, వసతి సదుపాయాలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!