
జనరల్

మెగా పీటీఎంలో పాల్గొనేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చేరుకున్న మంత్రి నారా లోకేశ్ జాగరంపల్లి వేదిక వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, వినతులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతిఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడిన నారా లోకేశ్ వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి సమస్యను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో కలిసి ఫోటోలు దిగుతూ అభిమానులను పలకరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!