

రూ.13 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న డ్రగ్ మాఫియా కింగ్‌పిన్ వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) భారత్‌కు తీసుకొచ్చింది. దాదాపు రెండేళ్లుగా పరారీలో ఉన్న బసోయాను ఇంటర్‌పోల్ సహకారంతో గుర్తించిన అధికారులు.. ఎన్‌సీబీ అభ్యర్థన మేరకు యూఏఈ అధికారులు ఈ ఏడాది జూన్‌లో అరెస్టు చేశారు. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకున్న అతడిని తాజాగా యూఏఈ నుంచి భారత్‌కు అప్పగించారు. భారీ మొత్తంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌కు బసోయా కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
బసోయాను భారత్‌కు తీసుకొచ్చిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. డ్రగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానంలో ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో దాక్కున్నా డ్రగ్స్ స్మగ్లర్లను వదిలిపెట్టబోమని, వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ఎన్‌సీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో బసోయాను భారత్‌కు తీసుకురావడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. అతడి విచారణతో డ్రగ్స్ సిండికేట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నిందితుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!