
బిజినెస్

కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు స్వదేశీ యుద్ధ నౌకలను ఒకేసారి జాతికి అంకితం చేశారు. ఈ మూడు యుద్ధ నౌకల ప్రారంభం భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రక్షణ రంగంలో స్వావలంబనకు మరో కీలక అడుగుగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సముద్ర శక్తి లేకుండా ఏ దేశమూ మహాశక్తిగా ఎదగలేదని పేర్కొన్నారు. భారత ఆలోచనలకు కొత్త దిశను చూపించిన రోజుగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు. అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు అన్నీ సముద్రంతో ముడిపడి ఉన్నాయని, దేశ భవిష్యత్తుకు బలమైన నౌకాదళం అత్యంత అవసరమని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!