

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పూరీ బీచ్ వద్ద ప్రత్యేక సైకత శిల్పం (సాండ్ ఆర్ట్) రూపొందించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కళాకృతిలో కేటీఆర్ చిత్రపటంతో పాటు "Happy Birthday KTR Anna @50", "Future CM of Telangana" అనే సందేశాలను కళాత్మకంగా ఆవిష్కరించారు. ఈ సైకత శిల్పాన్ని సందర్శించిన పర్యాటకులు, స్థానికులు ఆసక్తిగా వీక్షించి ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర కీలకమైందని అన్నారు. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆయన చేసిన కృషి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రజలతో ఎప్పుడూ మమేకమై ఉండే నాయకుడిగా కేటీఆర్కు విస్తృత ప్రజాదరణ ఉందని, ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!