
జనరల్

జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) లో ప్రస్తుతం 15 శాశ్వత పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. మొత్తం 39 శాశ్వత పోస్టులకు అనుమతి ఉండగా, అందులో 24 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు 73 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించగా, పరిపాలనా, కార్యనిర్వాహక పనుల కోసం 124 పోస్టులను ఔట్‌సోర్స్ చేసింది.
2026లో ఎన్‌టీఏ మొత్తం 126 పరీక్షలు నిర్వహించిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి తెలిపారు. వీటిలో నీట్-యూజీతో పాటు పలు జాతీయ స్థాయి ప్రవేశ, నియామక పరీక్షలు ఉన్నాయి. అలాగే ఎన్‌టీఏ ఆదాయం, వ్యయం, ఆర్థిక పరిస్థితి వివరాలను కూడా పార్లమెంట్‌కు సమర్పించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!