
టెక్నాలజీ

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటనను తీవ్రంగా విమర్శించారు. ఆయన ఈ పర్యటనను “ఫ్లాప్ షో”గా అభివర్ణిస్తూ, తెలంగాణ బీజేపీ నేతలు చిన్న సమావేశాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆరోపించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వీరి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు.
బూత్ స్థాయిలో గెలుస్తాం, కార్పొరేషన్ గెలుస్తాం అన్న బీజేపీ వ్యాఖ్యలు వాస్తవానికి దూరమని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే విభజన రాజకీయాలను తిరస్కరించారని చెప్పారు. కాళేశ్వరం అవినీతి, కేంద్ర నిధులు, నిరుద్యోగం వంటి అంశాలపై బీజేపీ సమాధానం చెప్పాలని, ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు జాతీయవాదం అనే ముసుగు వాడుతోందని విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!