

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో కొనసాగుతున్న నిరసనలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఇస్లామాబాద్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని తాను "భారత్ లాంటి శత్రువులు"గా భావిస్తున్నానని, వారిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిరసనకారులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు.
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనల్లో భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది మృతి చెందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే తమ బలగాలపై ముందుగా దాడులు జరిగాయని పాకిస్తాన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ, పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించింది. అక్కడి ప్రజల అసంతృప్తికి పాకిస్తాన్ విధానాలే కారణమని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!