

రీజినల్ రింగ్ రోడ్ (RRR) పూర్తయితే తెలంగాణకు గేమ్‌చేంజర్‌గా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, ప్రాజెక్టు పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 2018లో మంజూరైన 161 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ఇప్పటికీ భూసేకరణ దశను దాటలేదు. 2024 నవంబర్‌లో టెండర్లు ఆహ్వానించినప్పటికీ, సాంకేతిక కారణాలతో వాటిని నిలిపివేశారు. అనంతరం పీపీపీఏసీ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.23,935.6 కోట్లుగా ఖరారు చేసినా, ఆమోదం వచ్చి నెలలు గడుస్తున్నా పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించడం లేదు.
భూసేకరణ, పరిహారం అంశాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం మరింత ఆలస్యమవుతోంది. ఇదే సమయంలో 162 కిలోమీటర్ల ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. భూసేకరణ పూర్తయ్యే ప్రాంతాల్లోనైనా రహదారి నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ, ప్రాజెక్టులో ఆశించిన కదలిక కనిపించడం లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!