

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘షాక్: ట్రస్ట్ నో వన్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రెన్సిల్ డి సిల్వా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ సిరీస్ బృందం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకుంది. సప్న మల్హోత్రా, సిద్ధార్థ్ పి. మల్హోత్రా సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌లో జెన్నిఫర్ వింగెట్, అనూప్ సోనీ, సుమిత్ వ్యాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కనిపించకుండా పోయిన తన బిడ్డ కోసం తొమ్మిదేళ్లుగా ఆశ వదులుకోకుండా అన్వేషించే ఓ తల్లి భావోద్వేగ ప్రయాణం చుట్టూ కథ సాగుతుందని సిరీస్ వర్గాలు తెలిపాయి. మిస్టరీ, సస్పెన్స్‌తో కూడిన ఈ కథ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ఉండనుంది. ‘అమర్ సింగ్ చమ్కీలా’ తర్వాత దాదాపు రెండేళ్లకు పరిణీతి చోప్రా ఈ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో ఆమె విభిన్నమైన, భావోద్వేగభరిత పాత్రలో కనిపించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!