

టాలీవుడ్‌లో భారీ చిత్రాల విడుదల తేదీలు వరుసగా ఖరారవుతుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ 2027 జూన్ 11న విడుదల కానుండగా, పలుమార్లు వాయిదా పడిన యశ్ ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానుండగా, వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానున్నట్లు ప్రకటించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్ ‘స్వయంభూ’ చిత్రాల విడుదల తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ‘విశ్వంభర’లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కావడం, ఓటీటీ ఒప్పందం ముగియడం తర్వాతే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే రూ.100 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ‘స్వయంభూ’ కూడా డిజిటల్ డీల్ పూర్తయ్యాక విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. ఇదే సమయంలో నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ విడుదల తేదీపై కూడా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!