

పసుపు, నల్ల మిరియాల నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ను ఇవి సమర్థవంతంగా తటస్థీకరిస్తాయి. దీని వల్ల వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమవడంతో పాటు కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. పసుపులోని కర్కుమిన్, మిరియాలలోని పైపెరిన్ కలిసి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చూపుతాయి. పైపెరిన్ కారణంగా కర్కుమిన్ శోషణ 2000 శాతం వరకు పెరిగి శరీరంలో వాపును తగ్గించి కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది.
ఈ డ్రింక్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో పచ్చి పసుపు, మిరియాలు కలిపి తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. కాలేయం పనితీరును మెరుగుపరచి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కర్కుమిన్ మెదడు ఆరోగ్యాన్ని పెంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది. అయితే గర్భిణీలు లేదా మందులు వాడుతున్న వారు ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!