

స్టార్ హీరో లేకుండా, భారీ ప్రచారం లేకుండా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన ప్రభావం చూపుతోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.130 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఐదో వారంలోకి అడుగుపెట్టినా ప్రేక్షకుల ఆదరణ తగ్గకపోవడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కథ, భావోద్వేగాలు ప్రధాన బలంగా నిలిచినట్లు తెలుస్తోంది.
సాక్నిల్క్ నివేదికల ప్రకారం 32వ రోజున 7,343 షోల ద్వారా సుమారు రూ.10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో భారత్‌లో మొత్తం నెట్ వసూళ్లు రూ.132.13 కోట్లకు చేరుకున్నాయి. నీమ్ కరోలీ బాబా జీవితం, బోధనల స్ఫూర్తితో ఈ ఆధ్యాత్మిక కథను రూపొందించారు. శోభినావ్ సత్య, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెడ్గే కీలక పాత్రల్లో నటించారు. తల్లిని కోల్పోయిన బాలుడు దేవుడి అన్వేషణలో ప్రేమ, సేవ, భక్తి విలువలను తెలుసుకునే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ట్రైలజీలో భాగంగా తెరకెక్కుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!