

టాలీవుడ్‌లో హీరోల పెరుగుతున్న పారితోషికాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, సినిమా మార్కెట్ పరిస్థితులను హీరోలకు ముందుగానే స్పష్టంగా వివరిస్తానని, తన బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే హీరోలతోనే సినిమాలు నిర్మిస్తానని తెలిపారు. అయితే టాలీవుడ్ అగ్ర హీరోలు పారితోషికాన్ని తగ్గించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరని, రెమ్యునరేషన్ తగ్గితే మార్కెట్‌లో తమ ఇమేజ్ దెబ్బతింటుందనే భావన వారిలో ఉందని చెప్పారు.
రూ.300 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే అందులో సుమారు 35 నుంచి 40 శాతం, అంటే రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు హీరో పారితోషికానికే వెళ్తుందని దిల్ రాజు వెల్లడించారు. టాలీవుడ్‌లో బడ్జెట్ సమస్యలను అధిగమించాలంటే బాలీవుడ్‌లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను పరిశీలించాలని సూచించారు. ఒకప్పుడు భారీ ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ప్రస్తుతం సినిమా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!