
సినిమాలు

సీనియర్ నటి సిమ్రాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భర్త, ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ, విజయ్‌తో గడిపిన ప్రత్యేక క్షణాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఒకప్పుడు సహనటుడిగా పనిచేసిన విజయ్ను నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడటం గర్వకారణమని సిమ్రాన్ పేర్కొన్నారు. ఆయనలోని వినయం, ఆప్యాయత, నిజాయితీ ఇప్పటికీ అలాగే ఉన్నాయని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చూపుతున్న అంకితభావం, స్పష్టమైన విజన్ తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!