

కయాదు లోహర్ తన పాఠశాల రోజులలో ఎదుర్కొన్న వేధింపుల గురించి భావోద్వేగంగా స్పందించింది. పదో తరగతి చదువుతున్న సమయంలో ఇంటి సమీపంలోని ట్యూషన్‌కు వెళ్లే దారిలో కొందరు యువకులు తనను వేధించేవారని ఆమె తెలిపింది. రెండు రోజుల పాటు సహించినప్పటికీ, మూడో రోజు ఆవేశానికి లోనై వారిలో ఒకరిపై రాయి విసిరానని వెల్లడించింది. ఆ రాయి తలకు తగలడంతో అతడికి గాయమై రక్తస్రావం కావడంతో తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని గుర్తు చేసుకుంది.
ప్రస్తుతం ఆ సంఘటనను తలుచుకుంటే అది చాలా హింసాత్మక చర్యగా అనిపిస్తోందని కయాదు లోహర్ పేర్కొంది. కోపంలోనైనా ఇతరులను గాయపరచడం సరైన మార్గం కాదని తాను గ్రహించానని తెలిపింది. అయితే, ఎవరైనా తప్పు చేసినప్పుడు మౌనంగా భరించకూడదని, ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవాలని సూచించింది. ప్రస్తుతం కయాదు లోహర్ 'ఐ యామ్ గేమ్', 'ది ప్యారడైజ్', 'సూర్య 48' చిత్రాల్లో నటిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!