

'మిరాయ్' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న యువ నటుడు తేజ సజ్జా ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దేశీయంగా మంచి విజయాన్ని సాధించిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం జపాన్‌లో 'మిరాయ్: వారియర్ ఆఫ్ డెస్టినీ' పేరుతో ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. భారతీయ పురాణాల స్ఫూర్తితో రూపొందిన కథ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జపాన్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. అలాగే రితికా నాయక్, జగపతి బాబు, శ్రియ శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. గౌర హరి అందించిన సంగీతం, యాక్షన్ సన్నివేశాలు, ఉన్నత సాంకేతిక విలువలు చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో విజయవంతమైన తర్వాత ఇప్పుడు జపాన్ మార్కెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!