

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంపై సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ భారీ చిత్రానికి సంబంధించిన నేపథ్య సంగీత పనులను సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జనవరి నాటికి సంగీత కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో సినిమా విడుదల ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదనే సంకేతాలు లభించాయి. ఇప్పటికే చిత్రంపై ఉన్న అంచనాలు ఈ తాజా సమాచారం తర్వాత మరింత పెరిగాయి.
ఏప్రిల్ 7, 2027 విడుదల తేదీని యథాతథంగా కొనసాగించాలనే లక్ష్యంతో చిత్రబృందం పనులు వేగవంతం చేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర, శ్రీరాముడు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయగా, ప్రియాంక మందాకిని పాత్రలో కనిపించనున్నారు. సుమారు రూ.1300 కోట్ల వ్యయంతో కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, దేవా కట్టా సంభాషణలు రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కీరవాణి వెల్లడించిన సంగీత పనుల వివరాలతో అభిమానుల్లో సినిమా కోసం ఎదురుచూపులు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!