

యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు లేదా అదే రోజు పెయిడ్ ప్రీమియర్లను నిర్వహించే అవకాశాన్ని చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో పలు చిత్రాలకు పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించడం ద్వారా విడుదలకు ముందే ప్రేక్షకుల స్పందనను అంచనా వేస్తున్న విషయం తెలిసిందే.
సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రీమియర్ల ద్వారా పాజిటివ్ టాక్ వస్తే తొలి రోజు వసూళ్లకు భారీ ఊపు లభించే అవకాశం ఉంది. అయితే నెగెటివ్ స్పందన వస్తే ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశమూ ఉందని చెబుతున్నారు. ఈ చిత్రంలో నాభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!