

రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నప్పటికీ, జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమెను కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం చేశారంటూ విమర్శలు రావడంతో చిత్రబృందం కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదం అనంతరం హీరోయిన్లకు తమ పాత్రల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ ఉండదంటూ పలువురు నటీమణులు స్పందిస్తూ జాన్వీకి మద్దతు తెలిపారు.
ఈ నేపథ్యంలో దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు పాత్రల ఎంపికలో స్వేచ్ఛ ఉండదనే అభిప్రాయంతో తాను ఏకీభవించనని ఆమె స్పష్టం చేశారు. కథా చర్చల సమయంలోనే పాత్రకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారని, అసౌకర్యంగా అనిపించిన పాత్రలను చాలామంది నటీమణులు తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలనే పూర్తిగా నిందించడం సరికాదని, నటీనటులు తమ నిర్ణయంతోనే సినిమాల్లో నటిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!