
జనరల్

నటుడు విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘రణబాలి’ సినిమా సెట్స్‌లో ఐదు కారవాన్లు కావాలని, ఎక్కువ మంది సహాయకులు ఉండాలని ఆయన కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను విజయ్ దేవరకొండ టీమ్ ఖండిస్తూ అవి పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది.
ఈ వివాదంపై నిర్మాత రవి స్పందిస్తూ షూటింగ్ సమయంలో అలాంటి సమస్యలేవీ రాలేదని తెలిపారు. విజయ్ ఎప్పుడూ తన పనిపై అంకితభావంతో ఉంటారని ప్రశంసించారు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటిష్ పాలన కాలం (1854–1878) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుని సెప్టెంబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!