

‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ వంటి విజయవంతమైన చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘సుయోధన’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం ‘సేవ్ ది టైగర్స్-3’ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ప్రియదర్శి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ప్రియదర్శి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మించనున్నారని సమాచారం. అయితే దర్శకుడు ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రోత్సహించే సుకుమార్ బ్యానర్, విజయవంతమైన నిర్మాత బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి సినిమా వస్తే అది ఆసక్తికర ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!