
జనరల్

నటి రాశి ఖన్నా తాజాగా సామాజిక మాధ్యమాల్లో చేసిన ఓ భావోద్వేగ పోస్టు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గొప్ప కళాకారులతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు. ప్రతిభ మాత్రమే కాదు, క్రమశిక్షణ, వినయం, కళపై అంకితభావమే గొప్పతనాన్ని నిరూపిస్తాయని రాశి ఖన్నా తన సందేశంలో తెలిపారు.
సినిమా రంగంలోని గొప్ప మేధావులు, కళాకారులతో కలిసి కథలో భాగమవడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. వారి ప్రేమ, ఆప్యాయత, అనుభవాల నుంచి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!