

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో, దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ షెడ్యూల్‌లో భాగంగా దాదాపు 20 రోజుల పాటు రిషబ్ శెట్టి మరియు రానా దగ్గుపాటి పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనుండగా, రానా లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తోంది.
‘హనుమాన్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో పాటు, ఈ సీక్వెల్‌లో స్టార్ నటుల చేరికతో ఆసక్తి మరింత పెరిగింది. సంగీతాన్ని హరి గౌర అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!