
సినిమాలు

సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా విడుదల ఆలస్యంపై వచ్చిన చర్చలకు ఆయన స్పందించారు. రోహిత్ కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి ప్రధాన కారణం కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలేనని చెప్పారు.
ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీ ద్వారా విభిన్న కంటెంట్‌ను చూస్తున్నారని, వారి అభిరుచులు మారాయని తెలిపారు. అందుకే మంచి కథను ఎంపిక చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నానన్నారు. దర్శకుడు రోహిత్ విజన్‌తో ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని సాయి దుర్గా తేజ్ నమ్మకం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!