

రాకింగ్ స్టార్ యష్ హీరోగా, కీయారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో నటించిన భారీ చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ, హిందీ వెర్షన్లకు ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మాస్ రెస్పాన్స్ లభించింది.
అయితే తెలుగు వెర్షన్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా నిర్వహించిన టాక్సిక్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘన విజయం సాధించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ బుకింగ్స్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 24 నుంచి తెలుగు వెర్షన్‌కు ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కన్నడ, హిందీ భాషల్లో వచ్చిన మాస్ రెస్పాన్స్ మాదిరిగానే తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందించగా, యష్ మరియు కే. వెంకట రమణ నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!