
జనరల్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో నిర్వహించిన అనౌపచారిక చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగుతామని, ఆ దిశగా పార్టీ సన్నద్ధమవుతోందని తెలిపారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ అనుకూల పరిస్థితులు ఉంటే తెలంగాణలో కూడా పొత్తు ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అయితే అమిత్ షా తాజా వ్యాఖ్యలతో తెలంగాణ ఎన్నికల వ్యూహంపై స్పష్టత వచ్చినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!