

ఎడప్పాడి కె. పళనిసామి నేతృత్వంలో చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో మహిళా విభాగ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎడప్పాడి పళనిసామి మాట్లాడుతూ, పార్టీకి ద్రోహం చేసిన వారు బయటకు వెళ్లిపోతుండటంతో కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేను ఎవరూ నాశనం చేయలేరని స్పష్టం చేశారు. రెండాకుల గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేయించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. పార్టీ బలోపేతంలో మహిళల పాత్రపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో విద్యుత్ కోతలను ఖండిస్తూ, ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలని, మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ కళాశాలల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని తీర్మానాలు ఆమోదించారు. ఇదే సమయంలో మాజీ మంత్రులు ఎస్. పి. వేలుమణి, నత్తం విశ్వనాథన్ సమావేశానికి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!