

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫొటోపై రాజకీయ దుమారం రేగింది. ఓ మహిళ, చిన్నారితో కలిసి పడవలో ఉన్న రాహుల్ గాంధీ ఫొటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పంచుకున్నారు. ఈ ఫొటో ఎక్కడ, ఎప్పుడు తీశారు? రాహుల్‌తో ఉన్న మహిళ, చిన్నారి ఎవరు? అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. రాహుల్ విదేశీ పర్యటనలపై బీజేపీ గతంలోనూ విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఫొటోపై చర్చ మొదలైంది.
ఈ ఫొటోపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీతో ఫొటోలో కనిపిస్తున్న మహిళ, బాలుడు ఆయన స్నేహితుడి భార్య, కుమారుడని తెలిపారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఫొటో తీసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యతలు నిర్వహిస్తున్న అవి దండియా ప్రకారం, ఈ ఫొటో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లేక్ రే రాబర్ట్స్ వద్ద తీసినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!