

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ఆయన స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అందెశ్రీని కేవలం కవి, గాయకుడిగా కాకుండా తనకు ఆత్మబంధువుగా భావిస్తానని సీఎం పేర్కొన్నారు. ఆయన గానం, రచనలు తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయని, ఆ ప్రేరణతోనే ప్రజా సేవలో ముందుకు సాగుతున్నానని భావోద్వేగంగా తెలిపారు.
అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” వంటి పాటలు కేవలం గీతాలు కాదని, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయని రేవంత్ రెడ్డి అన్నారు. అందెశ్రీ, గద్దర్ వంటి ఉద్యమకారుల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది కుటుంబాలను గుర్తించి, ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున అందించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అందెశ్రీ స్ఫూర్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!