
ఆరోగ్యం

ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం భవిష్యత్ క్రిటికల్ మినరల్స్‌పై ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశాన్ని “మినరల్ పవర్”గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. గనుల రంగంలో సంస్కరణలు, క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా దేశ భద్రత, పారిశ్రామిక అభివృద్ధికి బలమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు.
అలాగే గత ప్రభుత్వాలు జిల్లా ఖనిజ ఫౌండేషన్ నిధులను దారి మళ్లించాయని విమర్శించారు. సింగరేణి, బొగ్గు ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!