

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా-ఇరాన్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, తమ ప్రతిపాదనలకు ఇరాన్ నాయకత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్థాన్, బహ్రెయిన్, ఈజిప్టు వంటి దేశాలు కూడా ఈ ప్రక్రియకు మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఒప్పందంపై సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలో తేదీ, వేదికను ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఒప్పందం పూర్తిగా అమలులోకి వచ్చే వరకు ఇరాన్ ఓడరేవులపై పరిమితులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అయితే ట్రంప్ ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఇప్పటివరకు ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని, చర్చలు కొనసాగుతున్నాయని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇరాన్ చమురు మౌలిక వసతులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా బెదిరింపులకు తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పక్షాలు దౌత్య మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!