

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2026 క్వాలిఫయర్-2లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. వీడా కోవై కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరుచ్చి గ్రాండ్ చోళాస్ 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 99 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. కే. దీబన్ లింగేశ్ తొలి మూడు బంతుల్లోనే కే. రాజ్‌కుమార్, శ్యామ్ సుందర్, జగతీశన్ కౌసిక్‌లను ఔట్ చేసి అద్భుత హ్యాట్రిక్ నమోదు చేశాడు.
దీబన్ లింగేశ్ తొలి మూడు బంతుల్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా టీఎన్‌పీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అనంతరం మరో ఇద్దరు బ్యాటర్లు కూడా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడంతో తిరుచ్చి స్కోరు 6/5కి పడిపోయింది. లింగేశ్ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, మనిమారన్ సిద్ధార్థ్ 4 వికెట్లతో చెలరేగాడు. కోవై కింగ్స్ 84 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!