
జనరల్

హరారెలో జరిగిన అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు.
412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంది. ఫాల్కనర్ శతకం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. భారత బౌలింగ్ విభాగంలో అంబ్రిష్ 3 వికెట్లు, దీపేశ్ 2 వికెట్లు తీయగా, ఖిలాన్, కనిష్క్, ఆయూష్ తలో ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీని ఘనంగా అందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!