
క్రీడలు

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమి అనంతరం టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు వ్యూహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టు సరిగా వినియోగించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇస్తున్నప్పటికీ, అతడికి స్పష్టమైన బాధ్యతలు ఇవ్వడం లేదని, మొత్తం మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
సుందర్‌ను ఫినిషర్‌గా కాకుండా బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉపయోగించాలని అశ్విన్ సూచించారు. పవర్‌ప్లే ముగిసిన వెంటనే అతడికి బంతి ఇచ్చి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించేలా అవకాశాలు ఇవ్వాలని అన్నారు. అక్షర్ పటేల్‌కు ఇచ్చే నమ్మకాన్ని సుందర్‌కూ ఇవ్వాలని, బౌలింగ్ చేసే అవకాశాలే ఇవ్వకుండా అతడిని నమ్మదగ్గ ఆల్‌రౌండర్ కాదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!