

దేశంలో జూన్ 2026లో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లకు చేరుకుని గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2025 జూన్‌లో నమోదైన రూ.1.71 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి గణనీయమైన పెరుగుదల కనిపించింది. దేశీయ విక్రయాలు పెరగడం, దిగుమతులపై అధిక పన్ను వసూళ్లు నమోదుకావడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దేశీయ లావాదేవీల నుంచి స్థూల జీఎస్‌టీ వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్‌టీ ఆదాయం 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లుగా నమోదైంది. రిఫండ్‌లు రూ.32,436 కోట్లకు చేరగా, వాటి సర్దుబాటు అనంతరం నికర జీఎస్‌టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.6.32 లక్షల కోట్లకు చేరి 8.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!