

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం భారీ వరం ప్రకటించింది. మొత్తం ₹2,534 కోట్ల విలువైన రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ₹1,299 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ₹1,235 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్మాణాలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సుమారు 8 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకేచోట పనిచేసే, నివసించే అవకాశం కలుగుతుంది. ప్రపంచ స్థాయి సదుపాయాలు, హరిత భవన ప్రమాణాలు, విద్యుత్ పొదుపు వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ, కాన్ఫరెన్స్ హాళ్లు, క్యాంటీన్లు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలతో ఈ సముదాయాలు నిర్మించబడతాయి. 2018లోనే రాష్ట్ర ప్రభుత్వం 22.53 ఎకరాల భూమిని కేటాయించగా, తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో అమరావతి అభివృద్ధికి కొత్త ఊపు లభించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!